Lorry Drivers Awareness Program in Mahadevpur
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
బెల్లంపల్లి నేటిధాత్రి :
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, మండలాల తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి నినాదంతో వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహిస్తూ వ్యాపారాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, ఆరోగ్యంగా బలంగా ఉండాలని, ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని ఉద్దేశంతో మహిళ ఆర్థిక ప్రగతిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం, డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 2 వేల 671 స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల 31 లక్షల 12 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
