Journalists Begin 4-Day Relay Hunger Strike
4వ రోజు జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది గతంలో 37 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించకపోవడంతో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది కావున తక్షణమే అధికారులు స్పందించి 37 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు
