Journalists Appeal for Pending House Sites
అదనపు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు
37 మంది జర్న లిస్టులకు గతంలో ఇచ్చిన పట్టాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత 15 సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ జీవనం గడుపుతున్నాము. ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం 37 మంది జర్నలిస్టులను గుర్తించి అప్పటి ప్రభుత్వం పట్టాలను కేటాయించి మైలారం గుట్టపై ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్టి స్థలాన్ని చదును చేయించడం జరిగింది. అనంతరం ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. మా ఇళ్ల స్థలాల గురించి నూతనంగా గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ కి తెలపడం. జరిగింది. అలాగే మేము కూడా పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది. అయినా నేటికి రెండు సంవత్సరాలు గడిచిన మా సమస్య పరిష్కారం చేయలేకపోయారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించుకోలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రిలే నిరాహార దీక్షను చేయడం జరుగుతుంది ఈ సమస్యను పరిష్కరించి ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని అధికారులను కోరుకుంటున్నాం
