Demand for 50 Lakh Ex-Gratia in Worker’s Death
మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాలి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసనకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుడు బొల్లి రాజయ్య పని సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, పని ఒత్తిడి కారణమని కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు అత్యంత బాధాకరం అని అన్నారు మృతుని కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను ఉద్యోగాల నుండి తొలగించాలి అలా అలాగే కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు
భూపాలపల్లి మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ఇందిరమ్మ/డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అలాగే సేఫ్టీ కిట్లు, శానిటైజింగ్ సామగ్రి, యూనిఫామ్లు సకాలంలో అందించాలని, వేతనాలు పెండింగ్ కాకుండా విడుదల చేయాలని రవి పటేల్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నేతలు అనంతుల సంపత్, ఇనుగాల ప్రణీత్, గట్టు శ్రీకాంత్ పాల్గొన్నారు
