New District General Secretary Appointed
రైతు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీగా కే పొమ్ము రాథోడ్ నియామకం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలంలోని చూన్నబట్టి తాండాకు చెందిన కే పొమ్ము రాథోడ్ గారిని మొగడంపల్లి మండల రైతు సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించారు. సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఈ నియామకం ప్రకటించారు. రైతుల సమస్యలు, వ్యవసాయ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో రాథోడ్ కీలక పాత్ర పోషిస్తారని, మండలంలో రైతుల సంక్షేమం, పంటల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ అధికారులతో సమన్వయం వంటి అంశాల్లో చురుకుగా పనిచేస్తారని బాలరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సంఘ సభ్యులు కే పొమ్ము రాథోడ్ గారిని అభినందించారు.
