Panchayat Reservations Finalized in Zharasangam
సర్పంచుల…..వార్డ్ మెంబర్లు….”రిజర్వేషన్లు ఖరారు”..!
◆:- ఝరాసంగం జీపీ ఎస్సీ మహిళకు రిజర్వు..!
◆:- 33 జీపీల్లో..”13 జీపీలు మహిళలకు “..!
◆:- ఆశావాహులకు..”ఈ సారీ నిరాసే”..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: రెండున్నర సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అంటూ.. ఎదురుచూస్తున్న ఆశావాహులకు ఊరట కలిగించే విధంగా ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎట్టకేలకు గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఆదివారం జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా ఎన్నికల అధికారులకు నివేదికలను పంపారు. వార్డుల వారీగా ఝరాసంగం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మంజుల, ఎంపీఓ ఎన్, స్వాతి, అధికారుల బృందం “డ్రా” పద్దతిన అధికార, విపక్ష పార్టీల శ్రేణుల సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు మహిళలకు 50 శాతంలోపు రిజర్వేషన్ కల్పిస్తూ ఖరారు చేశారు.
ఝరాసంగం మండలంలో 33 జీపీల్లో 13 జీపీలు మహిళలకు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలోనే 33 గ్రామ పంచాయతీలతో అతిపెద్ద మండలం ఝరాసంగం 33 గ్రామపంచాయతీల్లో 13 జీపీలను మహిళలకు కేటాయించగా.. మిగిలిన 17 జీపీ లను పురుషులకు కేటాయించారు. మండలంలో 288 వార్డుల గాను 126 మహిళలు, 162 జనరల్ రిజర్వుగా ఖరారు చేశారు. ఎస్సీ మహిళలకు 35, ఎస్సీ జనరల్ 48 . బిసి మహిళలకు 20, బీసీ జనరల్ 34. జనరల్ మహిళలకు 64, జనరల్ 73, ఎస్టీ మహిళ 7, ఎస్టీ జనరల్ 7 చొప్పున వార్డుల వారిగా రిజర్వేషన్ కల్పిస్తూ “డ్రా” పద్ధతిన ఖరారు చేశారు.
ఝరాసంగం ఎస్సీ మహిళకు రిజర్వ్..
మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామ పంచాయతీని ఎస్సీ మహిళకు ఖరారైంది. 33, గ్రామ పంచాయతీల్లో.. జనరల్ మహిళలకు 9, బీసీ మహిళలకు 3, జనరల్ రిజర్వ్ 8, ఎస్సీ మహిళ 2, ఎస్సీ జనరల్ 5, బీసీ జనరల్ 2 మేర ఆయా గ్రామపంచాయతీ సర్పంచులగా పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆశావాహులకు..” ఈ సారీ నిరాసే”..!
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అంటూ.. రెండున్నర సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న.. పలువురు ఆశావాహులకు ఈ సారి సైతం నిరాసే మిగిలింది. మండలంలోని అధికార, విపక్ష, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువతలు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిని కనబరిచారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని ఆశించిన పలువురు చివరకు నిరాశకే లోనయ్యారు.మండల కేంద్రమైన ఝరాసంగం,
కొన్ని తదితర గ్రామాల్లో అధికార, విపక్ష పార్టీ శ్రేణులతో పాటు యువత సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఆసక్తిని కనపరిచారు. ఎట్టకేలకు రిజర్వేషన్లు వారికి ప్రతికూలంగా రావడంతో నిరాశకు గురయ్యారు.
గ్రామ పంచాయతీ మహిళా వార్డు రిజర్వేషన్లు లాటరీ ద్వారా పాల్గొన్నాన పార్టీ నాయకులు
ఝరాసంగం మండల పరిధిలోని గ్రామ పంచాయతీ వార్డు మహిళా సభ్యుల రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేసేందుకు ఝరాసంగం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ మంజుల తెలిపారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు లాటరీ ద్వారా పాల్గొన్నాన పార్టీ నాయకులు, ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు విశ్వనాతం
సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు చంద్రన్న పాల్గొన్నారు,
