Indiramma Mahila Shakti Saree Distribution
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ ఘన కార్యక్రమం
మహిళా ఉన్నతే సమాజ ప్రగతి — దేశ పురోగతి
మహిళలే దేశ నిర్మాణపు మౌలిక శక్తి
మహిళలు బలంగా ఉంటేనే జాతి పునాదులు బలపడతాయి
కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం” ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ
నేటిధాత్రి ఐనవోలు హన్మకొండ :-
హన్మకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు మీటింగ్ హాల్ లో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా వ్యవహరించారు.
కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు.
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు మాట్లాడుతూ,ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీలో పాల్గొనడం నాకు అదృష్టం.భూమాతకు ఉన్నట్లు మహిళలకు ఓపిక ఉంటుంది.మహిళలు చదువులో రాణిస్తే కుటుంబ ప్రగతి అనివార్యం.మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి ఎమ్మెల్యే నాగరాజు పేర్కొంటూ, రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ అసలు లక్ష్యం అని అన్నారు.
బి. ఆర్. ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
ఎమ్మెల్యే మాట్లాడుతూ,పాత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేనివి. పంటచేనుల్లో వేసుకునేవి.ప్రస్తుతం నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.చీరల పంపిణీతో చేనేత కార్మికులకు ఉపాధి లభించింది.కేసీఆర్ పాలన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. కేటీఆర్–కవిత–హరీష్ రావు వేల ఎకరాల భూములు, ఫార్మ్ హౌస్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి.సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు.
కేటీఆర్ అహంకారంతో సీఎం పై ఏకవచనంలో మాట్లాడుతున్నారు
అని వ్యాఖ్యానించారు.
మహిళల కోసం ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే నాగరాజు వివరించారు
ఈ కార్యక్రమంలో:అదనపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు రజిని ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ జిల్లా – మండల – గ్రామ సమైక్య సంఘాలు అధికారులు, ప్రజాప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.
