CC Road Works Begin in Ramadugu Colony
సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను నుండి సీసీరోడ్డు కోసం చొప్పదండి నియోజకవర్గం శాసన సభ్యులు మేడిపల్లి సత్యం డబ్బులు మంజూరు చేయించడం జరిగింది. ఈసిసి రోడ్డు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన గోపాలరావుపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ వడ్లూరి రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరుశురాం, సీనియర్ నాయకులు జెట్టిపెళ్లి వీరయ్య, పొన్నం మల్లేశం, రాజు, సామి, సత్యం, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, అనిల్, బుడగ జంగాల కాలనీవాసులు, కనకమల్లు, వెంకటేష్, నర్సయ్య. మల్లయ్య, సత్యం, మానుపాటి సుధాకర్, స్వామి,తదితరులు పాల్గొన్నారు.
