వరంగల్, హన్మకొండ మిలర్ల ముచ్చట్లు?
వరంగల్ ‘‘జెసి’’కి కనిపించని ‘‘మిల్లుల అవినీతి అక్రమాల’’ పై మీ ‘‘నేటిధాత్రి’’ల్లో వరుస కథనాలు.

`వరంగల్ ‘‘జేసీ’’కి మిలర్ల మీద ఎందుకంత అపారప్రేమ?
`మిల్లర్లు ‘‘జీబి’’లు ఎంత ఇచ్చినా పరవాలేదా?’’

`హన్మకొండ ‘‘జేసీ’’ మాత్రం ఎంత ‘‘జీబి’’లు ఉంటే అంతే వడ్లు కేటాయిస్తున్నాడు?
`హన్మకొండ మిలర్లకు ఎందుకు మింగుడు పడడం లేదు!

`హన్మకొండ ‘‘జేసీ’’ మాత్రం లెక్కలు పక్కాగా వుండాలంటున్నాడు.
`వరంగల్ ‘‘జేసీ’’ అవేవి ఎందుకు పట్టించుకోవడం లేదు?
‘‘రా రైస్’’ మిల్లర్లు 10 పది లక్షలు ఇచ్చినా ఎందుకు ‘‘జెసి’’ సరే అంటున్నారు?
‘బాయిల్డ్ రైస్’’ మిల్లర్లు 20 లక్షలు ఇస్తే చాలని ‘‘జెసి’’ ఎందుకు అంటున్నారు?
`హన్మకొండ ‘‘జేసీ’’ జీబి ఎంత ఇస్తే అంతే వడ్లు ఎందుకిస్తానంటున్నాడు?
`నాలుగు రోజులు గడిస్తే వద్దన్నా వరంగల్ ‘‘జేసీ’’ వడ్లు కేటాయిస్తారు?
`ఇది రెండు జిల్లాల మిల్లర్లు చెప్పుకుంటున్న మాటలు?
`ఇప్పటికే వరంగల్ మిలర్ల బకాయిలు కొండలా పేరుకుపోయాయ్?
`మిల్లర్ల బకాయిలు వరంగల్ ‘‘జేసీ’’ వసూలు చేయడం లేదు?
`మిలర్ల మీద వరంగల్ ‘‘జేసీ’’ కి అంత ఉదారత ఎందుకు?
`హన్మకొండ ‘‘జేసీ’’ వసూలు చేసినట్లు, వరంగల్ ‘‘జేసీ’’ ఎందుకు వసూలు చేయడం లేదు?
`బకాయిలు వసూలు చేయడానికి వచ్చిన ఇబ్బందులేమిటి?
`వరంగల్ ‘‘జేసీ’’ కేటాయిస్తున్న వడ్లకు, మిల్లర్లు తిరిగి ఇస్తున్న బియ్యానికి పొంతన ఎందుకు లేదు?
`మిలర్ల ‘‘కరంటు బిల్లులు’’ చెక్ చేస్తున్నారా?
`’’కరంటు బిల్లులు’’ ఎందుకు తక్కువ వస్తున్నాయి?
`మిలర్లకు కేటాస్తున్న వడ్లు ఎటు పోతున్నాయి?
`కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఒక్క సారి లుక్కేయండి?
`వరంగల్ మిలర్ల దోపిడీ చూడండి?
`కరెంటు కాలకుండా వడ్లు ఎలా ఆడిరచారు?
`మూతపడిన మిల్లులకు వడ్లు ఎలా ఇస్తున్నారు?
`ఆ మిల్లర్లు బియ్యం తిరిగి ఎలా చెల్లిస్తున్నారు?
`విద్యుత్ శాఖను మోసం చేస్తున్న మిల్లర్లు.
`ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారో ఆరా తీయండి?
హైదరాబాద్, నేటిధాత్రి: తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా కనిపించని, వినిపించని కొన్ని విషయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వెలుగులోకి వస్తుంటాయి. చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలో ఈ మధ్య ఒక ఆసక్తికరమైన సంబాషణలు రైస్ మిల్లర్ల మధ్య వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లకు చెందిన జాయింట్ కలెక్టర్ మిల్లర్ల విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. అదే పక్కనే వున్న హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ కాస్త మిల్లర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. కాని ఉదారత ఎందుకు? కఠినత్వం ఎందుకు? అనేది చాలా విచిత్రంగా వుంది. చట్టపరంగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలే అందుకు లోబడి మాత్రమే హన్మకొండ జేసి పనిచేస్తున్నారు. అంటే మిల్లర్లకు అనుకూలంగా పనిచేయడం లేదు. మిల్లర్లు కోరే గొంతెమ్మ కోరికలు తీర్చడం లేదు. వారికి అనుకూలంగా చట్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యహరించడం లేదు. పక్కా లెక్క ప్రకారం నడుచుకుంటున్నారు. ఇది హన్మకొండ జిల్లాలోని మిల్లర్లకు ఇబ్బందిగా మారింది. అదే పక్కనే వున్న వరంగల్ జిల్లాకు చెందిన జేసి మాత్రం మిల్లర్లకు అనుకూలంగా వుంటున్నారు. అనేది ఒక చర్చ. ఇందులో వాస్తవాలు ఏమిటన్నది అటు మిల్లర్లు, ఇటు అధికారులే చెప్పాలి. కాని మిల్లర్ల మధ్య జరుగుతున్న చర్చ మాత్రం వాస్తవం? ఎందుకంటే వరంగల్ జిల్లాలో వున్న మిల్లులే తక్కువ. అందులోనూ మూతపడిన మిల్లులు కూడా వున్నాయి. అసలు మిల్లులేని వాళ్లు కూడా కొందరున్నారు. వాళ్లందరికీ ఎంత కోరితే, అంత కావాలంటే అంత వడ్లను జేసి అనుమతులు మంజూరు చేస్తున్నారు. కాని హన్మకొండ జిల్లాకు చెందిన జేసి మాత్రం లెక్క ప్రకారం ఎంత బ్యాంకు గ్యారెంటీలు ఇస్తే అంత వరకు మాత్రమే వడ్లు కేటాయిస్తున్నారు. ఇది మిల్లర్లకు నచ్చడం లేదు. మిల్లర్లు చట్ట ప్రకారం నడుచుకోవాంటున్నారు. బ్యాంకు గ్యారెంటీలకు తగ్గట్టు మాత్రమే వడ్లను కేటాయిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పైరవీలకు తావు లేదు. ఏ మిల్లర్ అదనంగా వడ్లు కోరినా ఇవ్వడం లేదు. పూర్తిగా పారదర్శంగా అన్నీ వుండేలా హన్మకొండ జేసి చూసుకుంటున్నారు. కాగితాల మీద పక్కా లేక్కలుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలకు, ఇచ్చిన వడ్లకు, మళ్లీ మిల్లులు ఇచ్చే బియ్యంలో ఎలాంటి తేడా రాకుండా చూసుకుంటున్నారు. అదే హన్మకొండ మిల్లర్లకు నచ్చడం లేదు. ఇబ్బందిగా మారింది. పక్కనే వున్న వరంగల్ జిల్లా జేసి మాత్రం రా రైస్ మిల్లులు కేవలం రూ.10లక్షల బ్యాంకు గ్యారెంటీలు ఇస్తే చాలు ఎన్ని వడ్లు కావాలంటే అన్ని ఇస్తున్నారు. బాయిల్డ్ రైస్ మిల్లర్లు రూ.20లక్షలు బ్యాంకు గ్యారెంటీలు ఇస్తే చాలు. ఎన్నివడ్లైనా ఇస్తున్నారు. దాంతో రెండు జిల్లాలకు చెందిన మిల్లర్లు ఒక చోట చేరినప్పుడు చెప్పుకుంటున్న, చేసుకుంటున్న సంబాషణలు. అంటే వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లర్లు ఇప్పటికే ప్రభుత్వానికి కోట్లలో బాకీలున్నారు. వారికి ఎంత సమయం ఇచ్చినా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదు. అందులోనూ చాలా వరకు మిల్లులు మూసి వున్నాయి. అవి పని చేయడం లేదు. కొంత మందికి మిల్లులే లేవు? అని కూడా తెలుస్తోంది. ఇది ఎంత నిజమో? అధికారులే తేల్చాలి. వారికి కూడా వడ్లు కేటాయిస్తున్నారు. అలా కేటాయించిన వడ్లను మిల్లులేని వాళ్లు ఎక్కడ బియ్యంగా మార్చుతున్నారు? ఎలా తిరిగి ప్రభుత్వానికి ఆ బియ్యం ఎలా అందిస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది? ఒక వేళ ఆ వడ్లను వారి మిల్లుల్లోనే ఆడిస్తే ,బియ్యంగా మార్చితే అందుకు తగిన ఆధారాలు ఏమీ చూపించే పరిస్దితుల్లో లేరు. కనీసం మిల్లులు నడుస్తున్నాయని చెప్పడానికి అసలు రుజువైన కరంటు బిల్లులు చూపించాల్సిన అవసరం వుంది. అంతే కాదు ప్రభుత్వానికి బియ్యంతోపాటు, కరంటు బిల్లులుకూడా అందించాలి. కాని ఆ బిల్లులు ప్రభుత్వానికి అందించడం లేదు. అసలు విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన మిల్లులు ఎలా తెరుస్తున్నారు? ఎలా వారికి అదికారులు వడ్లు కేటాయిస్తున్నారు? వాళ్లు మిల్లులు ఎలా ఓపెన్చేస్తున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారిపోయింది. వ్యవస్ధనే సవాలు చేసే స్దాయికి ఎదిగిపోయింది. ఈ విషయాలు వరంగల్ జిల్లా జేసికి తెలిసి చేస్తున్నారా? జేసికి తెలియకుండా అదికారులు సాగిస్తున్నారా? జేసి వరకు ఈ విషయాలు చేరకుండా మిల్లర్లు జాగ్రత్తపడుతూ మళ్లీ, మళ్లీ మోసం చేస్తున్నారా? అన్నది తేలాల్సివుంది. అన్నీ తెలిసే వరంగల్ జేసి మిల్లులకు వడ్లు కేటాయిస్తున్నారా? అన్నది కూడా వెలుగులోకి రావాల్సిన అవసరంవుంది.. ఎందుకంటే రెండు జిల్లాలకు చెందిన మిల్లర్లు కలిసినప్పుడు మీ జేసి చాల మంచి వారు. మీరు అడిగినంత వడ్లు కేటాయిస్తున్నారు? అంటూ వరంగల్ మిల్లర్లతో హన్మకొండ మిల్లర్లు ఎందుకు అంటున్నారు? మిల్లర్ల అవకతవకలు పట్టించుకోకండానే వరంగల్ జేసి ఎలా వడ్లు కేటాయిస్తున్నారు? అనేది తెలియాల్సి వుంది. ఇక హన్మకొండ మిల్లర్ల ఎత్తుగడలు మరో విధంగా వున్నాయి. వడ్ల కేటాయింపులు అన్నీ పక్కాగా జరగాలని చూస్తున్న హన్మకొండ జేసికే చుక్కలు చూపించాలని మిల్లర్లు యోచిస్తున్నారట? ఇప్పుడు జేసి వడ్ల కేటాయింపును పకడ్భందీగా అమలు చేస్తున్నారు? నాలుగు రోజులు పోతే జిల్లాకు పెద్దఎత్తున వడ్లు పోటెత్తుతాయి. వరంగల్ లో మిల్లులకు ఆ సామర్ధ్యంలేదు. హన్మకొండ జిల్లా నుంచే కాకుండా పొరుగున వున్న ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్దఎత్తున వడ్లు వస్తాయి? అప్పుడు జేసి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారట? అప్పటి వరకు వడ్లు తీసుకోకుండా కాలయాపన చేస్తే అప్పుడు జేసియే తమను బ్రతిమిలాడే పరిసి ్ధతి వస్తుందని చర్చించుకుంటున్నారట. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో పెద్దగా రైస్ మిల్లులు లేవు. అక్కడ వరి ఎక్కువగా పండుతోంది. ఆ ధాన్యమంతా హన్మకొండకు రావాల్సిందే. అప్పుడు జేసి వడ్లు తీసుకొమ్మని మిల్లర్ల మీదనే ఒత్తిడి చేసే పరిస్ధితి వస్తుందనుకుంటున్నారట? అంటే మిల్లర్లు తమ బకాయిలు చెల్లించాల్సి వుండి కూడా వాటిని చెల్లించడం లేదు. పైగా ప్రభుత్వం ఆదేశాలను పాటించడం లేదు. వడ్లు ఎంత కావాలంటే అంత మేరకు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడానికి కూడా సిద్దంగా లేరు. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు అక్కడే వున్నాయి. వాటిని చెల్లించేందుకు సిద్దంగా లేరు. కాని వడ్లు మాత్రం ఇస్తే తీసుకుంటాం? అనే పరిస్దితిలో వున్నారంటే ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే పక్కనే వున్న వరంగల్ జేసి ఎందుకు ఇలా చేస్తున్నారు? లెక్కలు ఎందుకు పక్కాగా అమలు చేయడం లేదు? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అటు మిల్లర్లకు, ఇటు సివిల్ సప్లై అదికారులకు మధ్య ఒప్పందాలు బాగానే వున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే మిల్లర్లు అడిగినంత వడ్లు కేటాయిస్తున్నారు. లక్షల్లో బ్యాంకు గ్యారెంటీలుఇచ్చిన మిల్లర్లకు కోట్లలో వడ్లు కేటాయిస్తున్నారని సమాచారం. అటు సివిల్ సప్లైశాఖను, ఇటు విద్యుత్ శాఖను ఏక కాలంలో మిల్లర్లు మోసం చేస్తున్నారు. మిల్లులు నడవాలంటే కరంటు ఖర్చు కావాలి. కాని కరంటు వాడుతున్న లెక్కలు లేవు. కాని ఆ మిల్లులకు వడ్లు వెళ్తున్నాయి? వాటి నుంచి బియ్యం వస్తున్నాయి? అంటే ఏదో జరుగుతోంది. నడవని మిల్లులకు వడ్లు కేటాయించడమేమిటి? ఆ మిల్లులనుంచి బియ్యం వచ్చినట్లు అదికారులు లెక్కలు చూపడమేమిటి? ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. అటు వడ్లు, ఇటు బియ్యం అందరూ కలసి మాయం చేస్తున్నారు. లేని బియ్యం ప్రభుత్వానికి లెక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి కొడుతున్నారు. అంటే కోట్లాది రూపాయలు అటు మిల్లర్లు ఇటు అధికారుల తింటున్నారన్నది అర్దమౌతోంది. ఇప్పటికైనా కమీషనర్ స్టీఫెన్ రవీంధ్ర రంగంలోకి దిగితే అసలు బండారమంతా బైట పడుతుంది. జేసి నిర్ణయాల నుంచి, అదికారుల ఆదేశాలు, మిల్లర్ల నాటకాలు అన్నీ బైటకు వస్తాయంటున్నారు. కంచె చేసు మేసినట్లు అధికారుల వ్యవహరించడం వల్ల మిల్లర్లు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. అటు సివిల్ సప్లయ్ శాఖనే కాకుండా, విద్యుత్ శాఖకు మోసం చేస్తున్నారు. ఉన్నతాదికారుల రంగంలోకి దిగితే అన్నీ బైటకొస్తాయి? జరుగుతున్న అవినీతి వ్యహారమంతా వెలుగులోకి వస్తుంది.
