Library Week Highlights the Power of Books
పుస్తకాలతో జ్ఞానం సంపాదించుకోవచ్చు
నర్సంపేట,నేటిధాత్రి:
సంపాదించగలుగుతామన్నారు.ఎంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా, ఎన్ని కొత్త కొత్త పరికరాలు వచ్చిన పుస్తకాలకు సాటిరావని, ప్రాచీన కాలం నుంచి నేటితరం వరకు పుస్తకాలకున్న ప్రాధాన్యత ఎవరు తగ్గించలేదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్,సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కెవి చలపతిరావు,సీనియర్ ఫ్యాకల్టీ పి. వాసుదేవరావు తెలిపారు.నర్సంపేట
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంబించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షత వహించారు.వారు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంధాలయాలను సందర్శించడం ద్వారా గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్ని తమ భవిష్యత్తు కొరకు సోపానాలుగా మలుచుకోవాలని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసామని విద్యార్థులు ఉపయోగించుకుని ప్రపంచంలో ఉన్న నలుమూలల జ్ఞానాన్ని పొంది ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థి దశ నుంచి పుస్తకాల పఠనం అలవర్చుకోవాలని అప్పుడే ఉన్నత స్థానానికి ఎదగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ ఆర్.గణేష్,ఎ. లావణ్య పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయగా అధ్యాపకులు,విద్యార్థులు పుస్తకాల ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
