SFI Demands Immediate Resolution of Student Issues
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలీ
ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టు మేట్రిక్ మెస్ కాస్మోటిక్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు.. బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్ మాట్లాడుతూ. జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు అన్నారు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మోటిక్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దాంతోపాటు ఏదైతే హాస్టల్స్ వార్డెన్స్ ఉన్నారో వారికి సమయంలో బిల్స్ రాకపోవడం వల్ల వారి యొక్క జీతాల నుంచి హాస్టల్స్ పెట్టి నడిపించే పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు దాని ద్వారా అనేకమైన ఇబ్బందులకు హాస్టల్స్ వార్డెన్స్ గురవుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి డైట్ చార్జీలు అమలు చేయాలని దాంతోపాటు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా జిల్లాలో ఎస్ఎంఎస్ హాస్టల్స్ కి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని వారు అన్నారు దాంతోపాటు. గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏ విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు దాంతోపాటు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
