Grand Rudra Yagam Successfully Concluded
మహా రుద్ర యాగం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
రుద్ర యాగ కమిటీ కో కన్వీనర్ ఆముదాలపల్లి అశోక్ గౌడ్
పరకాల,నేటిధాత్రి
సోమవారం రోజు పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో ప్రాంగణంలో కార్తీకమాస మహా రుద్రయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు.21 రోజుల నమక-చమక పారాయణం,32 మంది ఋత్వికుల సమూహ జపం,161 హోమ కుండాలు, 644 మంది దంపతులు హోమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.విశ్వశాంతి, జన సమృద్ధి కోసమే మహారుద్ర యాగం చేస్తున్నట్లు రుద్రయాగ కమిటీ కో కన్వీనర్ ఆముదాలపల్లి అశోక్ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యాగంలో పాల్గొన్న దంపతులకు భక్తులకు,సహకరించిన వివిధ శాఖల అధికారులకు,నాయకులకు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు
