Ayyappa Divine Padipuja
కన్నుల పండుగగా అయ్యప్పస్వామి పడిపూజ
ఉత్తర నక్షత్రం సందర్భంగా అభిషేకాలు,ఘనంగా అన్నాభిషేకం.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో 25 వ రజతోత్సవ మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో రెండోరోజు అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పదవ ఉత్తర నక్షత్ర ప్రత్యేక పడిపూజను శ్రీమాన్ బ్రహ్మ శ్రీ వెంకటేష్ శర్మ గురుస్వామి,ఘనాపాటి చంద్రమౌళి శర్మ తాంత్రిక పూజ,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో

దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై గణపతిహోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ,అష్టాభిషేకాలు,మండల కళాశాభిషేకాలు చేపట్టగా మొదటిసారిగా అన్నాభిషేకం కార్యక్రమం నిర్వహించగా ప్రత్యేక ఆకర్షణగా నిలువగా భక్తులు ఎంతగానో తరించిపోయారు.పడిపూజ దాతలుగా సింగిరికొండ రజిని మాధవశంకర్ గుప్తా, అనంతుల రాజకళ రాంనారాయణ, గొర్రెపల్లి విజయలక్ష్మి శ్రీనివాస్, మద్దెనపల్లి అనితా దేవి ఉపేందర్,తోట ఉమారాణి బాల భాస్కర్ గుప్త, తోట స్వాతి రామ్మోహన్, వీరమల్ల ఇందిరా బాబు రెడ్డి కూతురు-అల్లుడు మండల మమత గౌరీ శంకర్ రెడ్డి కుటుంబాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
ఆకర్షణ నిలిచిన అన్నాభిషేకం..
అయ్యప్పస్వామి దేవాలయంలో మొదటిసారిగా ఉత్తర నక్షత్ర, సిల్వర్ జూబ్లీ మహోత్సవ వేడుకల సందర్భంగా అయ్యప్ప స్వామికి అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి బ్రహ్మశ్రీ శ్రీమన్ వెంకటేష్ శర్మ అక్కడికి వచ్చిన మహిళా భక్తులతో అన్నాభిషేకం చేయించి వివిధ కూరగాయలతో అలంకరించారు. దీంతో అయ్యప్ప స్వామి ప్రత్యేక ఆకర్షణలలో భక్తులకు దర్శనమిచ్చారు.
సామూహిక పుష్పాభిషేకం..
మహా దివ్య పడిపూజ నిర్వహిస్తున్న సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వందలాదిమంది భక్తులతో అయ్యప్ప స్వామిపైన వివిధ రకాల పుష్పాలతో సామూహిక పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవాలయం పదునెట్టాంబడిపై కర్పూరలో వెలిగించగా జ్యోతిరూపంలో కనిపించగా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, గురు స్వాములు, భజనబృందం,దేవాలయ అర్చకులు,పలువురు భక్తులు పాల్గొన్నారు.
