MLA Attends Indiramma Housing Housewarming
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.
చిట్యాల నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని ముచినిపర్తి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం రైతులకు రుణమాఫీ మహిళల ఖర్చుతో బస్సు ప్రయాణం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలుగా చేసి రైతులను ప్రజలను మోసం చేసిందన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాధికారం లోకి వచ్చిన వెంటనే భూపాలపల్లి నియోజకవర్గంలో 3500 మంజూరు చేశామని ప్రస్తుతం గృహప్రవేశాలకు తయారవుతున్నాయని చిట్యాల మండలంలో 430 ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పటికి 290 ఇండ్లు పూర్తికా వస్తున్నాయని మిగతా ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో పేదవాడి ఇంటికల నిజమైందని అన్నారు, అనంతరం ఎమ్మెల్యే కోల కృష్ణవేణి దంపతుల నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహ బంతి భోజనం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూ ట్ల తిరుపతి, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, హౌసింగ్ పీడీ ఏఈ తాసిల్దార్ ఇమామ్ బాబా కాంగ్రెస్ మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
