పుట్టెడు శోకంలో స్నేహితుడికి స్నేహితులు నింపిన ధైర్యం.
స్నేహితుడు కుంగిపోకుండా అర్థిక సాయం.
స్నేహితుడు పుట్టుడు శోకంతో వున్నాడని తెలుసుకొని స్నేహమంటే ఇదే అని స్నేహితులు నిరూపించిన సందర్భం ఇది. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం వంటి మామిడికి చెందిన గోనె రాజు అనే వ్యక్తి కూతురు గోనె కీర్తన ఇటీవల మరణించింది. కూతురు మరణంతో పుట్టుడు దుఖంలో వున్న స్నేహితుడికి మేమున్నామని స్నేహితులంతా ధైర్యం చెప్పి ఓదార్చారు. కూతురు చనిపోవడంతో ఎక్కడ తమ స్నేహితుడు మానసికంగా కుంగిపోతాడో అని భావించి, ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామని నిరూపించారు. పోయిన కూతురును తెప్పించలేకపోయినా ఆ స్నేహితుడు ఆ భాధ నుంచి బైటపడేందుకు స్నేహితులంతా కలిసి వచ్చి గుండె దైర్యం నింపారు. కష్టంలో వున్న తన స్నేహితుడిని ఆదుకునేందుకు మిత్రులంతా కలిసి రూ. 54 వేలు సహాయం చేశారు. స్నేహితుడికి కొండంత అండగా నిలిచారు. స్నేహమంటే ఇదే అని నిరూపించారు.
