BC Dharma Deeksha Begins in Parakala
పరకాలలో బీసీల ధర్మ పోరాట దీక్ష ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం శీతకాల సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి
ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ
పరకాల,నేటిధాత్రి
బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని పట్టణంలోని బస్టాండ్ కూడలివద్ద బిసి.జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టారు.ఈ దీక్ష శిబిరాన్ని ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా కుల గణన చేసి బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం నిమిత్తమై గవర్నర్ కు పంపగా గవర్నర్ ఆబిల్లును పెండింగ్ పెట్టి కాలయాపన చేసిన కూడా మరి ఒక ఛాలెంజిగా తీసుకొని జీవో విడుదల చేయడం జరిగిందని రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావలసిన హక్కు మరి రిజర్వేషన్లకు ఆ చట్టాన్ని ఉక్కు కవచం మాదిరి చేయాలంటే పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు కేటాయించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఆముదాలపేల్లి మల్లేష్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పద్మశాలి సంఘం నాయకులు పోరండ్ల సంతోష్,సమన్వయ కమిటీ సభ్యులు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,సీతారాంపూర్ మున్నూరు కాపు సంఘం నాయకులు నల్లెల్ల అనిల్ కుమార్,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోడెల శ్రీనివాస్,గౌడ సంఘం అధ్యక్షులు బండి సదానందం గౌడ్,కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మార్కర్ రఘుపతి గౌడ్,రజక సంఘం అధ్యక్షుడు మాదాసి రామ్మూర్తి,వడ్ల సంఘం నాయకులు బాలాజీ స్వామి,కామరెడ్డిపల్లె బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోడెల సతీష్,ముదిరాజ్ సంఘం నాయకులు దామ అనిల్,బీసీ సంక్షేమ సంఘం నాయకులు దొమ్మాటి సతీష్,రాయపర్తి శ్రీధర్,బిసి జాయింట్ రియాక్షన్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
