Don’t Buy Flats in Assigned Lands: EMRO Satish
అసైన్డ్ భూముల్లోనీ వెంచర్లల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయకండి..
మందమర్రి ఎమ్మార్వో సతీష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలో అసైన్డ్ భూములు అన్యక్రాంతమవుతున్నాయని, అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తున్నారనీ ,ఫిర్యాదులు వస్తున్నాయని మందమర్రి ఎమ్మార్వో సతీష్ తెలిపారు. అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్లు చేసి ఫ్లాట్లు ఏర్పాటు చేస్తే అట్టి ఫ్లాట్లు ప్రజలెవరూ కొనుగోలు చేయరాదని ఎమ్మార్వో సతీష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేని ఫ్లాట్లను కొనుగోలు చేయవద్దని, ప్రభుత్వ భూముల్లో ఎవరైనా వెంచర్లు చేసి ఫ్లాట్లుగా మార్చి క్రయ విక్రయాలు జరిపినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గల మూతపడిన పాఠశాలల స్థలాలు సైతం ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని, అట్టి భూములను మళ్లీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోబడతాయని అన్నారు.
