Minister Vivek Inaugurates New College Building
నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక జూనియర్ కళాశాల నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు.రెండు కోట్ల యాభై ఐదు లక్షల సమగ్ర శిక్ష నిధులతో నూతన భవన నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధి పైన దృష్టిసారించి ఉన్నత విద్యను అందిస్తుందని,అన్ని విధాలుగా విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేశారు.
