Golden Seniors Shine in Swimming
వృద్ధాప్యంలోనూ తగ్గేదేలే…
విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో తిరుపతికి చెందిన ఎ.వెంకటేష్(67), సి.జయశంకర్(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్, బ్రేస్ట్ స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్‌కు రెండు చొప్పున సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.
తిరుపతి: విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో తిరుపతి(Tirupati)కి చెందిన ఎ.వెంకటేష్(67), సి.జయశంకర్(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్, బ్రేస్ట్ స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్(Jayashankar)కు రెండు చొప్పున సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. దీంతో నిర్వాహకులు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరిరువురు స్థానిక శ్రీనివాస క్రీడా సముదాయంలో స్విమ్మింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎ్‌సడీవో శశిధర్, కోచ్ చక్రవర్తి, పలువురు క్రీడాకారులు, ప్రముఖులు వారిని అభినందించారు.
