Reheating Food in Winter? A Serious Health Warning
శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!
శీతాకాలంలో చాలా మంది ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శీతాకాలం వచ్చిందంటే అందరికీ వేడివేడిగా తినాలని ఉంటుంది. చాలా మంది ఒకేసారి ఎక్కువగా వండి, మిగిలిపోయిన ఆహారాన్ని తర్వాత వేడి చేసి తింటారు. ఇది సమయం ఆదా చేసే అలవాటు అయినా, ఆహారంలో ఉన్న పోషకాలు తగ్గిపోవడంతో పాటు బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు దానిలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యత కోల్పోతాయి. ముఖ్యంగా బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లు లాంటి ఆహారాల్లో బాసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియా పెరిగి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది.శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆహారం త్వరగా చల్లబడుతుంది. ఇలా చల్లబడిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో సూప్, సాంబార్, కూరగాయలు, బియ్యం వంటివి మళ్లీ వేడి చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
