Woman Attacks Journalist in UP
జర్నలిస్ట్‌పై రెచ్చిపోయిన మహిళ.. చెప్పుతో చావు దెబ్బలు..
ఓ మహిళ న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌పై దాడి చేసింది. విచక్షణా రహితంగా అతడ్ని కొట్టింది. దాడి దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు సైతం దిగింది.
న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌కు దారుణమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళ అతడిపై చెప్పుతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టింది. బూతులతో రెచ్చిపోయింది. బెదిరింపులకు సైతం దిగింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత జర్నలిస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఫిరోజ్‌పూర్‌కు చెందిన రాహుల్ ఉపాధ్యాయ స్థానిక మీడియా సంస్థలో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతడు శుక్రవారం రాత్రి న్యూస్ కవర్ చేయడానికి సుభాష్ తిరహ ప్రాంతానికి వెళ్లాడు.
న్యూస్ కవర్ చేస్తున్న సమయంలో నాలుగు నుంచి ఐదుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడినంతా వీడియో తీయటం మొదలెట్టారు. ముస్కాన్ అనే మహిళ రెచ్చిపోయి ప్రవర్తించింది. రాహుల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా అతడిపై చెప్పుతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దాదాపు ఏడు సార్లు చెప్పుతో ముఖంపై కొట్టింది. దాడి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ముస్కాన్, ముస్కాన్ భర్త బెదిరింపులకు దిగారు.
