Illegal Constructions Backed by Chevella Municipality
అక్రమ నిర్మాణాలకు చేవెళ్లమున్సిపల్ అండదండలు
* చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ స.నెం.195 లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం
* పంచాయతీ అనుమతులు ఉన్నాయంటా..
* నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు లేవు
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం
* పత్రికల్లో కథనాలకు స్పందించని కమిషనర్
* రెండు నెలలుగా యతేచ్చగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణం పనులు
* కనీసం నోటీసులు ఇవ్వని వైనం
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ పరోక్షంగా అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు
* వెంటనే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి చర్యలు తీసుకోవాలి.
చేవెళ్ల,నేటిధాత్రి:
చేవెళ్ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారు. దాంతో కార్పొరేషన్ అదాయానికి భారీ స్థాయిలో గండిపడుతోంది. అధికారుల చేతి వాటంతోనే అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ వార్డులోని సర్వే నెంబర్ 195 లో మున్సిపల్ అనుమతులు లేకుండా 2నెలలుగా ఓ ఫామ్ హౌస్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ అంశాన్ని నేటిధాత్రి వార్త పత్రిక కథనాన్ని వెలువరించింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ అక్రమ నిర్మాణానికి ఎప్పుడో గతంలో 2023లో పంచాయతీ అనుమతులు తీసుకున్నారంటా అని మున్సిపల్ కమిషనర్ నిర్దారణ చేయకుండానె చెప్పారు.

2 ఏళ్ల క్రితం పంచాయతీలో తీసుకున్న అనుమతులు గడువు ముసినప్పటికీ చేవెళ్ల మున్సిపల్ గా ఏర్పడిన తర్వాత మున్సిపల్ అనుమతులు పునరుద్ధరించకుండా అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని చేవెళ్ల మున్సిపల్ అధికారులపై స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. గతంలో పంచాయతి అనుమతులు ఉన్నాయని చెపుతు, 2 నెలలుగా నిర్వీర్యామంగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణానికి మేము నోటీసులు ఇస్తామని ఇప్పుడు చెప్పటం గమనర్హం.
* నోటీసులు కూడా ఇవ్వడం లేదు..
ఈ అనధికారిక ఈ ఫామ్ హౌస్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవటం అక్రమనిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉదాసీనత కనబడుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా… అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిర్మాణ పత్రాలు లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ అధికారులపై తీరుపై మండల ప్రజలు మండిపడుతున్నారు.
•అధికారుల మౌనం ఎందుకో..?
ఈ ఫామ్ హౌస్ వ్యవహారంపై అప్పటి పంచాయతీ అధికారులు, ఇప్పటి మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని చెప్పే అధికారులు ఊరేళ్ళ మున్సిపల్ పరిధిలో ఫామ్ హౌస్ కడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా, మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలియడం లేదు.ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
