జర్నలిస్డుల సమస్యలను విస్మరిస్తే…ఆందోళన తప్పదు
టియూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం.
భూపాలపల్లి నేటిధాత్రి
జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తే ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) స్పష్టం చేసింది.
హైదరాబాదులోని శంకర్ పల్లి మండలం వద్ద గల ప్రగతి రిసార్ట్స్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ హలీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వాటిని తీర్చడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై రాష్ట్ర కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్యాతం సతీష్ కుమార్, సామంతుల శ్యామ్ లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటుంన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించక పోవడం చాలా విచారకరమని తెలిపారు.
జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడేషన్ కార్డ్స్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల జారీ కి సంబంధించిన ప్రక్రియను వీలైనంత తోందరగా చేపట్డి జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన బాట పట్టక తప్పదని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.ఇప్పకే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తో చర్చించినట్లు తెలుపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్డులు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా అకాడమి చైర్మేన్ శ్రీనివాస్ రెడ్డి కి వివరిస్తూ, జిల్లా లో జర్నలిస్ట్ శిక్షణా తరగలుతు ఏర్పాటు చేయడం కోసం వినతిపత్రాన్ని ఇవ్వడంతో సానుకూలంగా స్పందించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విదంగా చూస్తానని, తొందరలో జిల్లాలో శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తాని సానుకూలంగా స్పందించిన చైర్మెన్ కి జిల్లా కమిటి అభినందనలు తెలిపామన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ వీరబద్రస్వామి, సీనియర్ రిపోర్టర్ పుల్ల రవితేజ, ఐలయ్య లు పాల్గొన్నారు.
