Liquor Belt Shops Trouble Families in Zahirabad
బెల్టు జోరు… కుటుంబాలు బేజారు
చిన్న భిన్నం అవుతున్న పచ్చని సంసారాలు
పెడదారి పడుతున్న యువత..
పేరుకే కిరాణా షాపులు..
*అడ్డగోలుగా మద్యం విక్రయాలుపట్టించుకొని ఎక్సైజ్ అధికారులు
ప్రతి గ్రామంలో గల్లికో పుట్టగొడుగుల బెల్టు దుకాణాలు..
బెల్టు షాపులు మద్యం రక్కసి రెక్కలు విప్పింది
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు..
అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్న బెట్టు షాపు యాజమానులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలలోని వివిధ గ్రామాల్లో రాత్రింబవళ్ళు పొద్దున్న కొడుకుయక ముందే ఆటోలలో మందు బెల్ట్ షాపులకు సరఫరా అవుతుంది యథెచ్చగా మద్యం వ్యాపారం కొనసాగుతుంది. బెల్టు దుకాణాల్లో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన అధికారులు అండదండలతో అడ్డు అదుపు లేకుండా ఈ మద్యం వ్యాపారం దందా మండలంలో మూడు పూలు ఆరు కాయలుగా విరజిల్లుతుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న మద్యం వ్యాపారులు ఈ దందను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని కొనసాగిస్తున్నారు. రాయికోడ్ మండలంలో వివిధ గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నది. ప్రతి గ్రామం పల్లెలలో కిరాణా దుకాణాల కంటే ఎక్కువ మద్యం దుకాణాలే దర్శనమిస్తున్నాయి. మద్యానికి బానిసలై ఎంతోమంది పేద బతుకులు చింద్రమౌతున్నాయి. అయినా ఎక్సైజ్ పోలీసులు యంత్రానికి చీమకుట్టినట్లు కూడా లెదు వాళ్లకు నెలకు మాములు ఇస్తే చాలు. నాలుగు నెలలకు ఒకసారి తూతూ మంత్రంగా చుట్టపు చూపుగా తనిఖీలు నిర్వహిస్తూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. బెల్టు షాపు యజమానులు ఒక బీరు ఒక కోటర్ నుండి రూ. 20 నుండి రూ. 40 రూపాయల వరకు మద్యంపై అధికంగా వసూలు చేస్తున్నారు. మద్దూరు మండలంలో బెల్టు షాపులు ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఎనీ టైం మద్యం..

ప్రభుత్వ అనుమతి కలిగిన మద్యం దుకాణాల నిర్వహణకు సమయపాలనలొ నిబంధన ఉంది. కానీ ఎనీ టైం మద్యం దొరికేది ఒక బెల్టు షాప్ దుకాణాలొనే
ఇబ్బంది పడుతున్న మహిళలు..
గ్రామాలలో అక్రమంగా వెలసిన బెల్టు షాపుల దుకాణాల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం సేవించిన మత్తులో బెల్టు దుకాణాల వైపు వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ బెల్టు దుకాణాల వల్ల చెడు మార్గాలు పడుతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో బెల్టు దుకాణాలు చిచ్చు పెడుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు దుకాణాలపై అధికారులు కొరడా జరిపించాలని పలువురు మహిళలు కోరుకుంటున్నారు.
— యువతపై త్రీవ ప్రభావం..
గ్రామాలలో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా వెళుతున్నాయి. అందుబాటులో మద్యం దొరుకుతుంది. దీనివల్ల యువత మద్యానికి బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉందని పలువురు మేధావులు అంటున్నారు.
కేతకి దర్శనానికి ముందే…వైన్ షాపుల స్వాగతం
◆:-కానరాని ఎక్సైజ్ అధికారులు
రోడ్డు పక్కనే మద్యం దుకాణాలు… రాకపోకలకు అవస్థలు
పవిత్ర పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం గల ఝరాసంగంలోనికి ప్రవేశించగానే రోడ్డు పక్కనే ముందుగా రెండు మద్యం దుకాణాలు దర్శనమిస్తుంటాయి.ఝరాసంగం నుండి జహీరాబాద్ కు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో ఎప్పుడు రద్దుగా ఉంటుంది.దీనికి తోడు ఇక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో అనుక్షణం ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.అయితే కేతకి పుణ్యక్షేత్రానికి వచ్చే కర్ణాటక,మహారాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా స్థానికులు కూడా మద్యం దుకాణాల మూలంగా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కేతకి సంగమేశ్వర వైన్స్ పేరు గల మద్యం షాపు పూర్తిగా రోడ్డుకు ఆనుకునే ఏర్పాటు చేశారు.ఈ దుకాణంలో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేసిన వారు దుకాణం ముందురోడ్డుపైనే మద్యం తాగి అక్కడే పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఈ దుకాణం పక్కనే ఇళ్ళు ఉండడంతో మందుబాబుల ఆగడాలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ దుకాణం ముందు పలు సార్లు ఇక్కడ ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.ఈ షాపును తొలగించాలని గతంలో స్థానికులు పలుమార్లు కోరిన మామ్ముళ్లకు అలవాటు పడిన సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.దీంతో ప్రజల సమస్యలు నిత్య కృత్యం అయ్యాయి.అంతేగాక పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న అధికారులు కిమ్మనక పోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దుకాణం నుండి ఆటోలు ఇతర వాహనాల్లో అక్రమంగా మద్యంను గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నారు.దీంతో తాగుబోతుల జేబులకు చిల్లులు పడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాక ఇటీవలే జిల్లాలో మద్యం టెండర్లు పూర్తి చేయడంతో కొత్తగా ఝరాసంగంలో ఏర్పాటు చేసే మద్యం దుకాణాలను నివాస ప్రాంతాలు, ప్రధాన రోడ్డుకు దూరంగా ఏర్పాటు చేయాలని,లేనిపక్షంలో ఉద్యమిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
