Nerella Ramakrishna Honored with Doctorate for Social Service
సామాజిక సేవలో నేరెళ్ల రామకృష్ణ కి డాక్టరేట్.
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాల పల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల రామకృష్ణ గౌడ్ సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు
టేకుమట్ల మండలంలో ఏ సమస్య ఉన్న తాను ముందుండి పరిష్కార మార్గం కోసం కృషి చేయడం వంటి సామాజిక కార్యక్రమాలను వివిధ పత్రికల ద్వారా, సామాజిక మధ్యమాల ద్వారా గుర్తించిన ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి సేవ సొసైటీ ఇండియా వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ టేకుమట్ల మండలం నుంచి సామాజిక సేవలో రామకృష్ణ గౌడ్ కి గౌరవ డాక్టరేట్ పురస్కారానికి ఎంపిక చేసి, హైదరాబాదులో ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి, డాక్టర్ టీవీ రామకృష్ణ, ఎంఈఓ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్ మల్ల రమేష్, శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్ కాసన నాయక్ లు స్ఫూర్తి సేవ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణ గౌడ్ ని సన్మానించి గౌరవ డాక్టరేట్ ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఒక మారుమూల ప్రాంతం నుంచి తన సేవలను గుర్తించి తనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన
స్ఫూర్తి సేవా సమితి కి డాక్టర్ రామకృష్ణ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
