Woman Ends Life Over Ant Phobia in Sangareddy
చీమల ఫోబియాతో మహిళ షాకింగ్ నిర్ణయం.. సూసైడ్ నోట్ రాసి..
ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది.
సంగారెడ్డి, నవంబర్ 6: అనేక మంది అనేక రకాల వ్యాధులతో, మానసిక ఇబ్బందులతో చనిపోతుంటారు. ఆరోగ్యం బాగాలేక, లైఫ్ ఫెయిల్యూర్ కావడం, డిప్రెషన్, లోన్ల ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఫైనాన్సియల్ సమస్యలు, లైఫ్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు లేకపోయినా ఆమె చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారిగా షాక్ కు గురి చేస్తోంది. ఇలా కూడా చనిపోతారా? వామ్మో అంటూ ఈ విషయం తెలుసుకున్నవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన తీవ్రంగా కలచివేస్తోంది.
ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. చీమల ఫోబియాతో తాను చనిపోతున్నానని, తన కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీమల ఫోబియాతో మహిళా చనిపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహిణి మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
