Temple Glows with Karthika Lights at Jharsangam
కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి… భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి దేవస్థానం కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడింది. కార్తీకమాసం ఆఖరికి రోజైన అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి,స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు కోనేటిలో దీపాలు వదిలారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని విశేష పూజలు చేశారు.
