Water Crisis in Somnapalli
సోమనపల్లికి తాగునీరు రాక ఇబ్బంది పడుతున్న ప్రజలు
పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్…
సిపిఐ ఎం ఎల్.. జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ …
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామపంచాయతీ దళిత కాలనీకి పది రోజులుగా మంచినీళ్లు రాక బోరు నీళ్లు తాగుతున్నారు జ్వరాలు జలుబు దగ్గు వస్తున్నాయి గ్రామపంచాయతీకి సంబంధించినటువంటి పంచాయితీ కార్యదర్శి కానీ స్పెషల్ ఆఫీసర్ గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు . తక్షణమే వారిపై చర్య తీసుకొని మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దళిత కాలనీలో ఎలాంటి సమస్య ఉన్న అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు పట్టించుకోవడం లేదు తక్షణమే సమస్యను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాను మారపల్లి కొండయ్య జీడి సమ్మయ్య అంబాల సమ్మయ్య జీడి సృజన రామ్ యాకూబ్ జీడి రాజు అందాల రమ పాల్గొన్నారు
