Assigned Land Farmers Demand Titles
అసైన్డ్ భూముల రైతులకు పట్టాలు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారు
అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి
ఎం సి పి ఐ యు పార్టీ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం సౌలతండలో అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నా రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం సి పి ఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ సంవత్సరాల తరబడి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నా రైతులకు పాలకులు మాత్రం పట్టాలు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని అట్టి రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా ఉంటున్నాయని, బ్యాంకు రుణాలు కూడా వచ్చే స్థితి లేదని, యూరియా బస్తాలు కూడా భూమి పట్టా ఉంటేనే వస్తాయని ఆయన అన్నారు. రైతులందరూ సమిష్టిగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పట్టాలు సాధించేంత వరకు పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అనంతరం కన్వినింగ్ కమిటీని వేయడం జరిగింది. కన్వీనర్ గా దారావత్ వీరన్న ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బానోతు బాల్ సింగ్, గుగులోతు వెంకన్న, బానోతు బాలాజీ, బానోతు శ్రీను, బానోతు అమ్మి, బానోత్ సరోజ తదితరులు పాల్గొన్నారు.
