17నవంబర్ న మహారుద్రయాగ మహోత్సవం
కుంకుమేశ్వర ఆలయంలో ఘనంగాబిల్వార్చన కార్యక్రమం
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీకమాస మహా రుద్రయాగా మహోత్సవం 17నవంబర్ సోమవారం రోజున ప్రముఖ పండితులు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆచార్యత్వమున అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు మహారుద్రయాగ సమితి సభ్యులు తెలిపారు.ఈ సందర్బంగా రుద్రయాగ సమితి మరియు ఆలయ ధర్మకర్తల మండలి,దాతల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ యాగంలో ప్రాసాద ప్రదక్షిణ,ఉత్సవ అనుజ్ఞ, ప్రత్యాహ్నికపూజా,గోపూజా, గణేశపూజన,పుణ్యాహవాచ,పంచగవ్యప్రాశన,అగ్ని ప్రతిష్టాపన,మహారుద్రయాగము,మహాపూర్ణాహుతి,మహదాశీర్వచనము,తీర్థ ప్రసాద వితరణ,మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడునని పేర్కొన్నారు.

ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం
కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం దాతలు గందే సదానందం జగత్ లక్ష్మీ మరియు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోమల్లపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామీవారిని స్మరిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కొలువురి రాజేశ్వరరావు,మహా రుద్రయాగ సమితి అధ్యక్షులు ఎర్ర లక్ష్మణ్,మహా రుద్రయాగ సమితి కన్వీనర్ గంధ రవి,కో కన్వీనర్ ఆముదాల పెళ్లి అశోక్,పోచురాజు వెంకట్ రెడ్డి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
