CM Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి
పరకాల నేటిధాత్రి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ ఓటర్ల ను బెదిరించే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని,భారత దేశ సైన్యం పట్ల అగౌరవంగా మాట్లాడడం వారి ధైర్య సాహసాలను కించ పరిచే విధంగా నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి డిమాండ్ చేశారు.ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దాలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న అమలు చేయకుండా ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని తెలిపారు.బిజెపి పార్టీ అభ్యర్థికి ప్రజాదరణ మెండుగా ఉన్నందున జీర్ణించుకోలేక పోతున్నారని ఆపరేషన్ సింధూర్ పై బిజెపి పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.భారత జవాన్ల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
