Run for Unity Held in Odela Honoring Sardar Patel
సర్దార్ పటేల్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఓదెలలో రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం…
ఎస్సై దీకొండ రమేష్..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :
పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్ – 2025’ ను పురస్కరించుకొని పోత్కపల్లి పోలీసు విభాగం ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా 2 కిలోమీటర్ల రన్ ఉదయం 6:00 గంటలకు ఓదెల జగదాంబ సెంటర్ నుండి ఒర్రెగడ్డ వరకు నిర్వహించబడుతుంది.
దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలందరూ, యువత, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది, అన్ని సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సై రమేష్ పిలుపునిచ్చారు.
దేశ నిర్మాణంలో ఏకత అత్యవసరం. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానేత స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రన్ ఫర్ యూనిటీ లో భాగస్వామ్యం అవ్వాలి అని ఆయన పేర్కొన్నారు.
