Join the “Run for Unity” in Ramakrishnapur
“రన్ ఫర్ యూనిటీ”లో భాగమవ్వండి…
ఆర్కే పి ఎస్ఐ జి రాజశేఖర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రన్ ఫర్ యూనిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబర్ 31న నిర్వహించే ఒక మారథాన్ అని, ఇది దేశ ఐక్యతను చాటడానికి ఉద్దేశించబడింది అని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే నినాదంతో రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా 2 కే రన్ నిర్వహిస్తుందని పట్టణంలోని విద్యార్థులు, యువకులు, నాయకులు, ప్రతీ ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని 2కే రన్ ను విజయవంతం చేయాలని ఎస్సై తెలిపారు. ఉదయం సింగరేణి ఠాగూర్ స్టేడియం నుండి రామాలయం చౌరస్తాలోని హనుమాన్ విగ్రహం వరకు 2 కే రన్ ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ ఏక్తా దివాస్ వేడుకలను రామకృష్ణాపూర్ లో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా జాతీయ సమైక్యతను చాటిచెప్పే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని రామకృష్ణాపూర్ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రజలందరూ 2కే రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు.
