AP Flood Alert: Heavy Inflow into Krishna River
ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన
కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.
అమరావతి, అక్టోబర్ 30: మొంథా తుపాను(Cyclone Montha) కారణంగా ఎగువన కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. భారీ వర్షాల వల్ల కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శాఖాపరమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పరిహహక ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది.
