Beneficiaries Struggle with Faulty Subsidy Autos in Sangareddy
సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం…..!
◆:- ఆర్థిక ఇబ్బందుల్లో లబ్ధిదారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో, నైపుణ్యం కలిగిన అర్హులైన దళితులకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులముల సేవ, సహకార అభివృద్ధి సంఘం. ( ఎస్. స్సి. కార్పొరేషన్ ). ద్వారా, బ్యాంకు అధికారుల సహకారంతో, సబ్సిడీ ద్వారా, మహీంద్రా ఆల్ఫా డీలక్స్, బీ, యస్, 6, డీజిల్ ప్యాసింజర్, సెన్సార్లు కలిగిన, ఆటోలను, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సబ్సిడీ ద్వారా ఆటోలను తీసుకున్న కొన్ని నెలలకే, ఈ ఆటోలు చెడిపోవడంతో. ఇట్టి విషయమై ఎన్నో సార్లు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీని, ప్రభూత్వ అధికారులు స్పందించలేదన్నారు. ఈ వాహనంలో ఏ చిన్న లోపం తలెత్తిన, వీటిని బాగు చేయుటకు, ఇతర వాహనం సహకారంతో, హైదరాబాద్ వెళ్లవలసిందే నని, ఈ విధంగా గత మూడు సంవత్సరాల నుండి, ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్లి, తమ ఆటోను బాగు చేసుకొని వచ్చినప్పటికీని, మళ్లీ మళ్లీ చెడిపోవడంతో, లబ్ధిదారులు అప్పులపాలై, బ్యాంకులో ఆటో కొరకు తీసుకున్న అప్పును తీర్చలేక, బ్యాంకు అధికారుల, మరియు, మధ్యవర్థుల మాటలకు, మానసికంగా, బాధపడుతున్నామన్నారు. ఈ ఆటోలను, ప్రభూత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు మాత్రమే విక్రయించి, ఇతరులకు విక్రయించకుండా, గత మూడు సంవత్సరాలుగా, ఈ ఆటో విక్రయాలు నిలిపివేయడానికి గల కారణం ఏమిటో, సంబంధిత అధికారులు, పత్రిక ముఖంగా తెలియజేయాలని, ఈ ఆటోలను మాత్రమే, ప్రభుత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడానికిగల కారణం ఏమిటో, ఇతర కంపెనీల ఆటోలను ఇవ్వలేమని, సంబంధిత అధికారులు తమకు చెప్పడంతో, గథ్యాంతరం లేక,ఈ ఆటో ను తీసుకున్నామన్నారు. ఈ ఆటోలు తీసుకొని నష్టపోయిన లబ్ధిదారులను, ప్రభూత్వమే ఆదుకోవాలని, లబ్ధిదారులు కోరుచున్నారు,
