Youth Warned Against Drug Addiction
మత్తుకు బానిసై యువత అంధకారంలో కి వెళ్ళొదు
గుండాల సీఐ రవీందర్,ఎస్సై సైదా రహూఫ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
పోలీసులు చేపట్టిన చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా గుండాల సీఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ గుండాల నందు 2కే రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా మంగళవారం గుండాల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత తో గుండాల నందు 2కే రన్ నిర్వహించారు.ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన పడకుండా యువతకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించామని గుండాల సిఐ రవీందర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరించాలని కోరారు.గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి భాద్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు.మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు.ఎవరైనా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ గానీ,విక్రయిస్తూ గానీ,సేవిస్తూ గానీ పట్టుబడితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే ఉన్నతాధికారుల అదేశాలతో పీడి యాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో గుండాల ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
