Farmers Demand Immediate Paddy Procurement
ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్
చందుర్తి, నేటిధాత్రి:
వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం సోచనీయం అని చందుర్తి మండల బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్ అన్నారు.
అకాల వర్షాలు కురుస్తూ రైతులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని రైతుల పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని ఇకనైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిచిన ధన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
