vGrand Celebrations of Nagula Chavithi in Nallabelli
ఘనంగా నాగుల చవితి.
#ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితుడు శ్రీనివాస్ శర్మ.
#భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మహిళలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అభయ నాగేంద్ర స్వామి ఆలయంలో పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయానికి చేరుకొని పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామికి పూజలు గ్రామ ప్రజలతోపాటు మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లుతూ. ఇలాంటి దోషాలు లేకుండా కాపాడాలని పలువురు మహిళలు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు గందె శ్రీనివాస్ గుప్తా , కోటగిరి నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
