Illegal Land Grab in Government Property – Mandepally Villagers Protest
భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో. భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి చెట్లు నాటుతూ పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం. మండపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు. 337. నంబర్లో 360 ఎకరాల. ప్రభుత్వ భూమి ఉన్నది. దీనిపై కన్నేసిన భూకబ్జాదారులు రాత్రిపూట దున్నటం భూమిలో రాత్రికి రాత్రి చెట్లు నాటడంతో గ్రామంలోని గ్రామస్తులు శనివారం రోజున రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా ఆర్ ఐ. దినేష్. జిపిఓ. రెవెన్యూ సిబ్బంది శనివారం రోజున. మండే పల్లి గ్రామానికి వెళ్లి భూములను పరిశీలించారు. గ్రామస్తులు అభిప్రాయం ప్రకారం భూమి రెవెన్యూకి చెందాలి లేకుంటే గ్రామ అభివృద్ధికి చెందాలి. అని అధికారులకు వివరిస్తూ భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నించడఏమిటి అని రాత్రిపూట చెట్లు పెట్టించడం ఏమిటని ఆరోపించారు ఇప్పటికే . గ్రామంలో భూమిని భూకబ్జాదారుల. ఆక్రమణకు గురవడంతో. గ్రామంలోని గ్రామపంచాయతీకి గాని పశువులు మేకలుమేయడానికి గాని. ఉపయోగించడానికి. వీలుగా ఉండేలా చర్యలు తీసుకుంటూ. గ్రామంలో పిల్లలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు లో క్రీడా ప్రాంగణానికి ఉపయోగపడేలా సంబంధిత అధికారులు రెవెన్యూ సిబ్బంది భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ భూములను కాపాడి ప్రతి గ్రామంలో ప్రజలకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
