Support Naveen Yadav with a Huge Majority – MLA GSR
నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించండి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి 94వ డివిజన్ లోని సీతానగర్, వినోభానగర్, ఐక్యమత్యనగర్, ద్వారకానగర్ మారుతినగర్ లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి నవీన్ యాదవ్ అని, అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే జూబ్లీహిల్స్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలో మేము చేసిన మంచి పనులు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని, బీఆర్ఎస్ మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూ, సానుభూతితో ఓట్లు అడుగుతోందని ఎమ్మెల్యే జిఎస్సార్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
