Housing Officer Inspects Indiramma Housing Works in Nyalkal
జిల్లా గృహ నిర్మాణాధికారి చలపతిరావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్,ఇందిరమ్మ గృహ పథకం అమల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరు ఇండ్లను నిర్మించుకోవచ్చు అని, ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో బిల్లులు చెల్లిస్తామని, ఇండ్ల నిర్మాణాలను చేపట్టని గృహ లబ్దిదారులు వెంటనే పనులను ప్రారంభించాలని జిల్లా గృహ నిర్మాణాధికారి చలపతిరావు సూచించారు. శు క్రవారం మండలంలోని మెటల్ కుంట గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను పరిశీలించారు. గ్రామానికి 31 ఇండ్లు మంజూరు అవ్వగా 18 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానిక గృహ నిర్మాణ అధికారులు వివరించారు. జహీరాబాద్ డివిజన్ గృహ నిర్మాణాధికారి ఆంజనేయులు, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మండల ఏఈ శివానంద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిర, తదితరులతో కలిసి ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో అధికార పార్టీ శ్రేణులు పాండు రంగారెడ్డి, శ్రీకాంత్, సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.
