Subsidy Farm Machines for Farmers in Zharasangam
రైతులకు సబ్సిడీపై యంత్రాలు: వ్యవసాయ అధికారి వెల్లడి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో ఫార్మ్ మిషనరీ పథకం కింద రైతులకు సబ్సిడీపై యంత్రాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం, మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. స్ప్రేయర్లు, రోటోవేటర్లు, బ్రష్ కట్టర్లు, సీడ్ డ్రిల్, ఎంబీ పౌ వంటి మొక్కలు బట్టే మిషిన్లు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. యంత్రాలు కోరుకునే రైతులు తమ ఏఈఓలను సంప్రదించి, దరఖాస్తు, పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు అప్లికేషన్ ఫారం సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.
