Farmers Appeal to MLA Over Land Encroachment
భూమి ఇప్పించాలని ఎమ్మెల్యేకు అభ్యర్థన.
బాలానగర్ / నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామ రెవెన్యూ శివారులో ఎస్.ఆర్. పి కంపెనీ తమ భూమిని ఆక్రమించారని బాధిత రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87 లో 3.14 గుంటల భూమిని ఓ కంపెనీ అక్రమంగా ఆక్రమించి, తమ భూమిని ఎందుకు ఆక్రమించారని అడిగితే తమపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.
