Uday Shankar Patil Birthday Celebrated Grandly
ఘనంగా ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి;
ఝరాసంగం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నేత యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు, మిత్రులు, స్నేహితులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, కులసంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధ్వర్యంలో ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయ్ శంకర్ పాటిల్ కి జన్మదిన శు భాకాంక్షలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానం చేసి కేక్ కట్ చేపించి, తినిపించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, సీనియర్ నాయకులు రాచయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, నర్సింలు పాటిల్, సంగ్రామ్ పాటిల్, మారుతి పాటిల్, మల్లయ్య స్వామి, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, శ్రీకాంత్ పాటిల్, సిద్ధు పాటిల్, శ్రీనివాసరెడ్డి, కొల్లూరు వార్డు సభ్యులు ఎం విష్ణు, వై నగేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, సి ప్రకాష్, నీ విజయ్, నర్సింలు, సంజీవులు, ఎం సునీల్, సి అబ్రహం, మహమ్మద్ ఫక్రుద్దీన్ మహమ్మద్ మోలా మహమ్మద్ సాహెబ్ బుడగ జంగం గోపాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
