Sircilla Police Flag Day Open House Inspires Students
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం అదనపు ఎస్పీ చంద్రయ్య.
పోలీస్ అమరవీరుల సంస్మరణలో
(పోలీస్ ఫ్లాగ్ డే)
పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజుపోలీస్ అమరవీరుల సంస్మరణలో
(పోలీస్ ఫ్లాగ్ డే)ఈ సందర్భంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ…అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటు పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విధ్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఊదేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాల పై అవగహన పెంచుకోవాలన్నారు.
విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన విషయాలు.
● ఫ్రెండ్లీ పొలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తాయి.
● పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు.
● నేరాలు జరగకుండా నివారించడంలో మరియు జరిగిన నేరాన్ని త్వరగా చేదించడం లో సి.సి కెమెరాలు ఏవిధంగా ఉపయోగపడతాయి.
● మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీమ్ లు, భరోసా సెంటర్ ఏవిధంగా పని చేస్తాయి.
● పోలీస్ శాఖ ఉపయోగించే ఆయుధాలు,వాటి పనితీరు, ఏ సందర్భాలలో ఉపయోగపడతాయి అని వివరించడం జరిగింది.

● బాంబ్ స్క్వాడ్స్ ఏవిదంగా బాంబులను నివృత్తి చేస్తుంది,పోలీస్ జగిలాల పని తీరు పై అవగాహన కల్పించడం జరిగింది.
● విద్యార్థులకు ట్రాఫిక్ నియమలపై ఆవాహన కల్పించడం జరిగింది.హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్,ర్యాష్ చేయవద్దని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించడం జరిగింది.
● సైబర్ నేరాలగురించి ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచేయాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేయాలని వివరించడం జరిగింది.
పైవిషయాలకు సంబంధించి అర్మోరర్లు, బాంబ్ స్క్వాడ్ టీం, IT Core, భరోసా సిబ్బంది,షిటీమ్,ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిబ్బంది విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ఆర్.ఐ యాదగిరి,ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్ యాదవ్, దిలీప్, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు
