Pranay Goud Appointed TG Goud Youth Association President
టీజీ గౌడ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రణయ్ గౌడ్
మల్లాపూర్ అక్టోబర్ 21 నేటి ధాత్రి
తెలంగాణ గౌడ యువజన సంఘం కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షునిగా బాలసాని ప్రణయ్ గౌడ్ ను నియమిస్తూ మంగళవారం ప్రకటించారు.
జగిత్యాల జిల్లా అధ్యక్షులు బొంగాని పవన్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అధ్యక్షుడు అమరవేణి నరస గౌడ్ జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధరామయ్య గౌడ్ ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రణయ గౌడ్ ను ఎన్నుకున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు అలాగే గౌడ కులస్తుల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
