Duggondi KGBV Invites Applications for Cook Posts
దుగ్గొండి కేజీబీవి కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
హెడ్ కుక్ -1,అసిస్టెంట్ కుక్ – పోస్ట్..
ఈ నెల 25 న దరఖాస్తుల చివరితేదీ
మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
దుగ్గొండి మండలం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో కుక్కు పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం పలుకుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కేజీబీవి పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు, అసిస్టెంట్ కుక్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నామని పేర్కొన్నారు. ఈ రెండు పోస్టులకు 18 నుండి 45 సంవత్సరాలులోపు మహిళలు అర్హులని,సామూహిక వంటలో అనుభవం కల్గిఉండాలన్నారు.హెడ్ కుక్ పోస్టు కోసం పదో తరగతి పాస్ అయ్యి,స్థానిక మండలం వారు కావాలని తెలిపారు.అసిస్టెంట్ కుక్ పోస్టు కోసం స్థానిక దుగ్గొండి మండల వాసి అయ్యి ఏడవ తరగతి పాస్ అయి ఉండాలని వివరించారు. హెడ్ కుక్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థురాలు పదవ తరగతి మెమో, అసిస్టెంట్ కుక్ ఏడో తరగతి మెమో, కుల,నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, ఆధార్, వంటల అనుభవం ధృవీకరణ పత్రం, పాస్ ఫొటోస్ తో సంబంధిత దరఖాస్తు ఫామ్ కు జతపరిచి ఈనెల 25 సాయంత్రం 4 గంటల లోపు మల్లంపల్లి లో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం పాఠశాల ప్రత్యేక అధికారినికి అందజేయాలని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు.
