Paddy Soaked in Unseasonal Rain in Karimnagar
అకాల వర్షానికి తడిసిన వడ్లు
ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాక పోవడంతో రోడ్లపైనే ఆరబోత-బోయిని తిరుపతి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్ల పైన ఆరబోసిన వడ్లు రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంతవరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఐకెపి, డిసిఎంఎస్, పిఎస్సిఎస్, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు మొదలు కాకపోవడంతో రైతులు వడ్లను రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఇదే అదునుగా భావించి దళారులు ప్రభుత్వ రేటు కన్నా క్వింటాలకు మూడువందల నుండి నాలుగు వందల తక్కువ రేటుకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాల నుండి కాపాడుకోలేక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగం పైన దృష్టి సారించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసి మిల్లర్ల మాయాజాలం నుండి రైతాంగాన్ని కాపాడవలసిందిగా సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి పక్షాన ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి.
