Adivasi JAC Pays Tribute to Police Martyrs
ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు.
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..
కరకగూడెం మండలం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ)ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్ అమరులకు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీసు అమరవీరులకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి ఘనమైన నివాళులు ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఇదే మా ఘన నివాళి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ గారు అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రతినిత్యం ప్రజల రక్షణ కోసం, కర్తవ్యదీక్షలో ప్రాణ త్యాగాలు చేసిన యోధుల సేవలు ఎంతో స్ఫూర్తి దాయకమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు.
