Grand Diwali Celebrations in Bhupalpally
ఘనంగా దీపావళి పండుగ వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఘనంగా దీపావళి పండుగ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీదేవి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని భక్తితో దీపాలు వెలిగించడం జరిగింది. మాకు మా కుటుంబ సభ్యులకు సిరిసంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని శ్రీ లక్ష్మీదేవిని కోరుకోవడం జరిగిందని అన్నారు కుటుంబ సభ్యులు అందరం ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి ఇంటిల్లి పాదికి సకల శుభాలు కలుగుతాయని ప్రజల యొక్క నమ్మకంతో దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది
